గత యేడాదిలో వివాహం చేసుకున్న హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ఒకరు. తన ప్రాణస్నేహితుడు, ముంబైకు చెందిన యువ వ్యాపారవేత్త గౌతం కిచ్లూను పెళ్లాడింది. ఆ తర్వాత ఆమె హానీమూన్‌ను మాల్దీవుల్లో జరుపుకుంది. దీనిపై కాజల్ స్పందిస్తూ, ఈ హనీమూన్ ఆసాంతం ఎంజాయ్ చేసినట్టు చెప్పుకొచ్చింది.
అంతేకాకుండా, ప్రాణస్నేహితుడు భర్తగా తన జీవితంలోకి రావడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. కామన్ ఫ్రెండ్స్ ద్వారా గౌతమ్ కిచ్లూతో ఏర్పడిన పరిచయం వైవాహిక బంధంతో సాఫల్యంకావడం తన జీవితంలో అపూర్వఘట్టమని ఆనందం వ్యక్తం చేసింది.
ప్రస్తుతం వైవాహిక బంధంలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నట్టు చెప్పుకొచ్చింది. వివాహానంతరం బాధ్యతలు పెరిగాయని, భర్తే జీవన సర్వస్వమైపోయారని చెప్పుకొచ్చింది. మాల్దీవుల్లో జరిగిన హనీమూన్‌ను ఆసాంతం ఎంజాయ్ చేశామంది.
ఇకపోతే, 'జీవితంలోని ప్రతి క్షణాన్ని సానుకూల దృక్పథంతో ఆనందంగా గడపటానికి ఇష్టపడతాను. రోజువారి దినచర్యను గౌతమ్ అందించే ప్రేమపూర్వక కౌగిలింతతో ఆరంభిస్తాను. ఆ తర్వాత మహామంత్ర జపించి, 30 నిమిషాల పాటు ట్రెడ్‌మిల్ చేస్తాను' అని వివరించింది.