రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ (RKFI), మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ క్రేజీ కాంబినేషన్ లో కమల్ హాసన్ 234 చిత్రం 2024లో థియేటర్లోకి రానున్నట్లు సగర్వంగా ప్రకటించారు. ఉలగనాయగన్ కమల్ హాసన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఏఆర్ రెహమాన్ అందించనున్నారు. ఇద్దరు దిగ్గజాలు కమల్ హాసన్, మణిరత్నంల మ్యాజికల్ కలయిక వచ్చిన నాయగన్ కల్ట్ క్లాసిక్ గా నిలిచింది. దాదాపు 35 సంవత్సరాల తర్వాత మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ కాబోతుంది. ఉలగనాయగన్ కమల్ హాసన్, మణిరత్నం, ఆర్. మహేంద్రన్ & శివ అనంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.