మలేషియా బయలుదేరిన కమల్ హాసన్ టీమ్

డీవీ

శుక్రవారం, 28 జూన్ 2024 (16:32 IST)
SJ surya, Kamal Haasan, Siddharth
కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఇండియన్2,  భారతీయుడు2, హిందూస్తానీ2 ఇలా పలు పేర్లతో వివిధ భాషల్లో విడుదలకాబోతుంది. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రమోషన్ లు జరుగుతున్నాయి. ఇటీవలే ముంబైలో భారతీయుడు టీమ్ వెళ్ళింది. సినిమా ట్రైలర్ కూడా విడుదలచేసి ఆకట్టుకునేలా మలిచారు.
 
తాజాగా నేడు చిత్ర యూనిట్ మలేషియా బయలుదేరింది. అక్కడ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈరోజు TGV పెవిలియన్ బుకిట్ జలీల్‌లో ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. అవినీతిపై జరిగే పోరాటంగా మొదటి భాగంలో చూపించారు. ఇక త్వరలో విడుదలకాబోతున్న రెండో భాగంలో ఇంకా అవినీతి మరింత విస్త్రుతం అయి యూత్ ను నిర్వీర్యం చేసిందనేలా వుంది. ఇది ఇప్పటి ట్రెండ్ కు తగినట్లుగా శంకర్ మలిచారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు