దశావతారం మేకప్ ఆర్టిస్ట్ ను లాస్ ఏంజిల్స్ లో కలిసిన కమల్ హాసన్

బుధవారం, 26 జులై 2023 (15:51 IST)
Kamal-myke
ఉలగనాయగన్ కమల్ హాసన్ తన 40 సంవత్సరాల స్నేహాన్ని ఆస్కార్-విజేత మేకప్ ఆర్టిస్ట్ మైక్ వెస్ట్‌మోర్‌తో తన వృత్తిపరమైన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటున్నారు. కమల్ హాసన్ అమెరికా  పర్యటన సందర్భంగా వారు లాస్ ఏంజిల్స్ లో కలుసుకున్నారు. ఈ సందర్బంగా కమల్ నటిస్తున్న సినిమాలు ఇండియన్ 2, ప్రభాస్ కల్కి 2898 AD చిత్రాల ప్రస్తావన  వచ్చింది. కమల్ కు  గుర్తుగా బాణం ను మైక్ వెస్ట్‌మోర్‌ అందజేశారు. 
 
Kamal-myke
కమల్ హాసన్ నటించిన భారతీయుడు, అవ్వై షణ్ముగి (భామనే సత్యభామనే), 'దశావతారం'తో సహా పలు చిత్రాలలో మైక్ వెస్ట్‌మోర్‌ కలిసి పనిచేశారు. శాన్ డియాగో కామిక్ కాన్ 2023కి హాజరయిన సందర్భంగా ఈ కలయిక జరిగింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు