డిప్రషన్‌లో కరణ్‌ జోహార్, ఇంతకీ ఏమైంది? (Video)

శుక్రవారం, 10 జులై 2020 (22:37 IST)
డిప్రషన్లో కరణ్ జోహార్.. ఇప్పుడు ఇదే బాలీవుడ్లో హాట్ టాపిక్. ఆయన ఎవర్నీ కలవడం లేదట.. ఎవరు ఫోన్ చేసినా స్పందించడం లేదట. కరణ్‌ జోహార్ సన్నిహితుడు ఈ విషయాన్ని మీడియాకి తెలియచేసారు. ఇంతకీ మేటర్ ఏంటంటే... బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్యహత్య చేసుకోవడంతో.. బాలీవుడ్ సినీ పెద్దలు మానసిక వేదనకు గురి చేయడం వలనే ఆత్మహత్య చేసుకున్నాడని.. నెటిజన్లు మండిపడ్డారు.
 
ముఖ్యంగా కరణ్‌ జోహార్, అలియాభట్, సల్మాన్ ఖాన్ తదితరులపై విమర్శలు చేసారు. దీంతో కరణ్‌ జోహార్ బాగా అప్‌సెట్ అయ్యారని.. ఇలా జరిగినప్పటి నుంచి ఆయన ఇంట్లోంచి బయటకు రావడం లేదని తెలిసింది. అంతేకాకుండా ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడడం లేదట. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారని.. ఎన్నోసార్లు ఏడ్చాడని ఆయన సన్నిహితులు చెప్పారు.
 
కరణ్‌ జోహార్ లాయర్ ఇప్పుడు ఏమీ మాట్లాడడక పోవడమే మంచిదని చెప్పారట. అందుకనే కరణ్‌ జోహర్ ఎవరితోను మాట్లాడడం లేదన్నారు. అంతే కాకుండా భవిష్యత్‌లో స్టార్ హీరోలతో నిర్మించాలనుకున్న సినిమాలన్నీ క్యాన్సిల్ చేసుకున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. 

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు