కలెక్లన్లను తీసుకురాలేని హీరోలు కోట్లు డిమాండ్ చేయడం ఏమిటనే ప్రశ్న అందరిలో తలెత్తింది. హీరోల పారితోషికం వల్ల బడ్జెట్ పెరిగిపోయి నిర్మాతకు చాలా నష్టం చేకూర్చిన సందర్భాలున్నాయి. ఈ విషయంలో తెలుగు సినిమా నిర్మాతలు చాలాసార్లు ఛాంబర్ ద్రుష్టికి తీసుకువచ్చారు. ఆమధ్య కరోనా టైంలో కొంత పారితోషికం తగ్గించుకుంటామనే కొందరు తెలియజేసినా, ఆ తర్వాత పరిణామలు పాన్ ఇండియా సినిమాగా మారడంతో హీరోలు పారితోషిం తగ్గేదేలే అన్నట్లుగా మారింది.
బాలీవుడ్ లో పదిమంది ఫెద్ద హీరోలున్నారు. వారు ఎంత అడిగితే అంత ఇవ్వాలి. దానికి అనుగుణంగా నిర్మాత సినిమా చేయాలి. ఆ తర్వాత మార్కెటింగ్ చేయాలి. ఇది ఎంతవరకు వెళుతుంది. రిలీజ్ తర్వాత సినిమా బాగోలేదని టాక్ వస్తే నిర్మాతకు హీరో రెమ్యునరేషన్ డబ్బులు కూడా రావు అనేది కరణ్ మాట. ఇది ముఖ్యంగా తెలుగు హీరోలకు బాగా వర్తిస్తుందని టాక్ కూడా నెలకొంది. కొందరు హీరోలు సక్సెస్ లేకపోయినా డిమాండ్ బాగా చేస్తున్నారనే వార్తలు వినిపించాయి.
తాజాగా అక్షయ్ కుమార్ సినిమా విడుదలైంది. కానీ ఓపెనింగ్స్ పెద్దగా లేవు. అలాగే మరికొంతమంది హీరోల సినిమాలు విడుదలయ్యాయి. వారికి పెద్దగా ఓపెనింగ్స్ లేవు. ఇది బాలీవుడ్ గురించే ఆయన మాట్లాడలేదు. మొత్తం భారతీయ ఇండస్ట్రీ గురించి మాట్లాడారని కొందరు తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా నిర్మాత బాధలు నిర్మాతకే తెలుసు కనుక ఇప్పటికైనా హీరోలు మారాలని కొందరు పేర్కొంటున్నారు.