కూచిపూడి డాన్స‌ర్ల‌కు ఉడ‌తాభ‌క్తి సాయం చేసిన కార్తి

మంగళవారం, 15 జూన్ 2021 (17:58 IST)
Karti
క‌ళాకారుల‌ను ఆదుకోవ‌డం కోసం ప‌లువురు క‌థానాయ‌కులు ర‌క‌ర‌కాలుగా ప్ర‌య‌త్నాలు చేస్తూనే వున్నారు. త‌మిళ‌నాడులో కార్తి, సూర్య కుటుంబం క‌ళాకారుల‌ను ఆదుకోవ‌డమేకాకుండా విప‌త్క‌ర ప‌రిస్థితుల‌కు కోటి రూపాయ‌ల ఫండ్ ను ముఖ్య‌మంత్రి స్టాలిన్ కు అంద‌జేశారు. అయితే త‌మిళ‌నాడులో జ‌రిగిన ఎటువంటి కార్య‌క్ర‌మం అయినా అక్క‌డ వారిని ఆదుకోవ‌డం మామూలే. కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వున్న వారికి ఎంతో కొంత సాయం చేయ‌డం విశేష‌మ‌నే చెప్పాలి.
 
ముఖ్యంగా క‌రోనా వ‌ల్ల ఎంతోమంది వృత్తిప‌రంగా దెబ్బ‌తిన్నారు. ముఖ్యంగా క‌ళాకారులు. కూచిపూడి క‌ళాకారుల‌కు పెద్ద‌గా ప‌ని లేకుండా పోయింది. అందుకే వారికి క‌రోనా మొద‌టివేవ్లో ఎంతో కొంత సాయం చేయ‌మ‌ని వారి ప్ర‌తినిధి భావ‌న పెద్ర‌పోలు, కార్తిని కోరారు. అయితే ఆ స‌మ‌యంలో ప‌రిస్థితులు అనుకూలించ‌క చేయ‌లేక‌పోయారు. తాజాగా కార్తి, కూచిపూడి కళాకారులయిన యాభై మందికి ల‌క్ష రూపాల‌య‌ల‌ను వారికి పంచ‌మ‌ని భావ‌న‌గారికి అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా కార్తికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తూ ట్వీట్ చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు