'ఇకపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కాలేజీలు డిగ్రీ కోర్సులను ఇంగ్లీష్ మీడియంలోనే అందించాలని.. అన్ని ప్రైవేటు ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ కాలేజీలు తెలుగులో అమలు చేస్తున్న కోర్సులను ఇంగ్లీష్ మీడియంలోకి మార్చుకోవాలని' ఉన్నత విద్యామండలి సూచించింది. ఇవి కొత్త విద్యా సంవత్సరమైన 2021-22 నుంచే వర్తిస్తాయని తెలిపింది.
కాగా, కొత్త విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ కాలేజీలు అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలోనే కోర్సులను అందించాలని ఫిబ్రవరి 12వ తేదీన సీఎం వైఎస్ జగన్ ఉన్నత విద్యపై నిర్వహించిన సమీక్షలో నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే.