టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, మెహ్రీన్ కాంబినేషన్‌లో తెరక్కిన చిత్రం "కవచం". శ్రీనివాస్ మామిళ్ళ దర్శకత్వం వహించాడు. వంశధార క్రియేషన్స్ బ్యానర్‌పై నవీన్ సొంటినేని(నాని) నిర్మిస్తున్నారు. డిసెంబర్‌లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రం టీజర్ సోమవారం రిలీజ్ అయింది. ఇందులో హీరో సాయి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు.
టీజర్‌లో ఎక్కువ భాగం యాక్షన్ సీన్స్ ఉండగా, డైలాగులు కూడా అదే రేంజ్‌లో ఉన్నాయి. 'భయపెట్టే వాడికి, భయపడే వాడికి మధ్య కవచంలా ఒక్కడుంటాడురా. వాడే పోలీస్' అంటూ బెల్లంకొండ శ్రీనివాస్ చెప్పే డైలాగ్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
చిత్రంలో హర్షవర్ధన్ రాణే, బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ కీలకపాత్రల్లో నటించారు. పోసాని కృష్ణమురళి, సత్యం రాజేష్, అపూర్వ ఇతర పాత్రల్లో నటించారు. ఇప్పటికే 'కవచం' షూటింగ్ పూర్తి కాగా, పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. ఎస్.ఎస్.థమన్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రానికి ఛోటా కే.నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.