మహానటి బయోపిక్‌లో సావిత్రి పాత్రధారిగా కనిపించిన హీరోయిన్ కీర్తిసురేష్‌కు అరుదైన గౌరవం దక్కింది. మహానటి సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్‌గా విజయం సాధించింది. అంతేకాదు ఈ సినిమాలో నటనకు కీర్తి సురేష్ ఏకంగా జాతీయ స్థాయిలో ఉత్తమనటి అవార్డు గెలుచుకుంది. ఈ నేపథ్యంలో త్వరలోనే రాష్ట్రపతి నుంచి కీర్తి సురేష్ ఈ పురస్కారం అందుకోనుంది.
ఈ అవార్డు అందుకోనే లోపే కీర్తి సురేష్ మరో ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకుంది. వివరాల్లోకి వెళితే.. తాజాగా ఓనం పండగ సందర్భంగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం కీర్తి సురేష్‌ను ఆ రాష్ట్ర అత్యున్నత పురస్కారంతో గౌరవించింది. అంతేకాదు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్వయంగా ఈ అవార్డును అందజేశారు. ప్రస్తుతం కీర్తి సురేష్ హిందీలో అజయ్ దేవ్‌గణ్ ‘మైదాన్’ సినిమాలో నటిస్తోంది. మరోవైపు ''మిస్ ఇండియా'' చిత్రంలో నటిస్తోంది.