విజయ్ దేవరకొండపై క్రష్.. సారా అలీఖాన్ వెల్లడి.. రౌడీ హీరో ఏమన్నాడంటే?

బుధవారం, 13 జులై 2022 (14:54 IST)
Vijay Devarakonda
టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండపై బాలీవుడ్ హీరోయిన్లు సైతం తమ క్రష్ అంటూ ప్రకటించారు. ఇప్పటికే జాన్వీ కపూర్ తన క్రష్ విజయ్ దేవరకొండ అని పలు సందర్భాల్లో వెల్లడిస్తే తాజాగా సారా అలీఖాన్ కూడా తన క్రష్ విజయ్ దేవరకొండ అనే విషయాన్ని బయట పెట్టింది. అయితే ఈ విషయం మీద విజయ్ దేవరకొండ ఆసక్తికరంగా స్పందించాడు. 
 
బాలీవుడ్ టాప్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ప్రస్తుతం కాఫీ విత్ కరణ్ ఏడవ సీజన్ హోస్ట్ చేస్తున్నాడు. తాజాగా కరణ్ జోహార్ సారా అలీ ఖాన్ జాన్వీ కపూర్‌లను తన షోకి గెస్టులుగా పిలిచి వారిద్దరిని ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ఆ ప్రోమో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.  
 
జాన్వీ కపూర్ సారా అలీ ఖాన్ మధ్య ఉన్న స్నేహం గురించి చెప్పాలని కోరిన కరణ్ జోహార్ ఆ తర్వాత ఎవరితో డేటింగ్ చేయాలనుకుంటున్నారు అనే విషయం కూడా చెప్పాలని సారాని అడిగారు.
 
అయితే దానికి ముందు సమాధానం చెప్పను అన్నా సరే చివరికి విజయ్ దేవరకొండ పేరు చెప్పింది. అయితే వెంటనే కరణ్ జాన్వీకి కూడా విజయ్ అంటే ఇష్టమని మీకు తెలుసా అంటే దానికి ఆమె నవ్వేసింది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  
 
ఇక ఈ వీడియో చూసిన విజయ్ దేవరకొండ కూడా సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరంగా స్పందించారు. సారా అలీ ఖాన్ డేటింగ్ కామెంట్స్‌పై విజయ్ దేవరకొండ స్పందిస్తూ దేవరకొండ అని నువ్వు పిలిచే విధానం నాకు బాగా నచ్చింది. 
 
క్యూటెస్ట్ నీకు నా బిగ్ హగ్స్ అండ్ ఎఫెక్షన్ పంపుతున్నా అంటూ ఆయన పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే ఆయన లైగర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు.
 
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో అనన్య పాండే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో ఆయన ఒక కిక్ బాక్సర్ పాత్రలో నటించారు. 
 
ఈ సినిమా ఆగస్టు నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమా నుంచి తాజాగా ఒక సాంగ్ కూడా విడుదలైంది. ఆ సాంగ్‌కి అద్భుతమైన స్పందన అయితే లభించింది. 
 
ఇక ఈ సినిమా సెట్స్ మీద ఉన్న సమయంలోనే పూరి జగన్నాథ్‌తో జనగణమన అనే సినిమా కూడా ప్రకటించారు విజయ్ దేవరకొండ. ఇక ఆ సినిమాతో పాటు శివ నిర్వాణ దర్శకత్వంలో ఆయన ఖుషి అనే సినిమా చేస్తున్నాడు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు