తెలంగాణా సంస్కృతిని ప్రతిబింబిస్తూ రూపొంది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో ప్రశంసలు అవార్డులు రివార్డుల అందుకున్న ఓ గిరిజన యోధుడి పోరాట గాధతో రూపొందిన కొమరం భీమ్ సినిమా రూపొంది 18 ఏళ్ళ తరువాత విడుదలై శతదినోత్సవం జరుపుకున్న సినిమా.. తెలంగాణా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మెచ్చిన సినిమా.
ఈ సినిమాను తెలంగాణా రెండవ అవతరణ దినోతవ్సవం సందర్భంగా హైదారాబాద్ ఫిలిం క్లబ్ .. శ్రీ సారధి స్టూడియోస్ వారు సంయుక్తంగా చిత్ర ప్రదర్శనను సారథి స్టూడియోస్ ప్రివ్యూ థియేటర్‌లో జూన్ రెండో తేదీ సాయంత్రం 6.30 గంటలకు ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రదర్శనకు ప్రత్యేక అథిదిగా (Sri C. Parthasarathi, IAS, Prl. Secretary, Agricuture attending the programme.) హాజరు కానున్నారు.