"రొరి" మూవీలో తెలంగాణా ముఖ్య‌మంత్రిగా శ్రీ కోటాశ్రీనివాస‌రావు

శుక్రవారం, 10 జులై 2020 (17:12 IST)
విల‌క్ష‌ణ న‌టుడు కోటా శ్రీనివాస‌రావు వేయ‌ని పాత్ర‌లు లేవ‌నే చెప్పాలి. భార‌త‌దేశంలో సుమారు అన్ని భాష‌ల్లో న‌టించి మెప్పించిన గొప్ప లెజండ‌రి యాక్ట‌ర్ ఆయ‌న‌. గ‌తంలో చాలా చిత్రాల్లో ముఖ్య‌మంత్రి పాత్ర‌లో క‌నిపించారు. మ‌రికొన్ని పాత్ర‌ల్లో అపోజిష‌న్ లీడ‌ర్‌గా క‌నిపించారు. కాని మొట్ట‌మెద‌టిసారిగా కొత్త రాష్ట్రం అయిన తెలంగాణా ముఖ్య‌మంత్రి పాత్రలో న‌టించ‌డం విశేషం.
 
ఈరోజు కొటా శ్రీనివాస‌రావు గారి పుట్టిన‌రోజ‌పు సంద‌ర్భంగా ఈ లుక్‌ని రొరి చిత్ర యూనిట్ విడుద‌ల చేశారు. ఈ చిత్రంలో ఆయ‌న చాలా సెన్సిటివ్ ముఖ్య‌మంత్రిగా వైవిధ్య‌మైన పాత్రలో న‌టిస్తున్నారు. ఈ పాత్ర పేరు ఆర్‌. రామ‌న్న చౌద‌రిగా ద‌ర్శ‌కుడు తీర్చిదిద్దాడు.
 
ఈ చిత్రాన్ని సీటీఎస్‌ స్టూడియోస్‌, ఎస్‌టీవీ ఎంటర్‌టైన్స్‌మెంట్స్‌ సంయుక్తంగా చరణ్‌ రోరి నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం మొద‌టి లుక్‌ని ఇటీవ‌లే విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. ఈ  ఫస్ట్‌లుక్‌కి సోష‌ల్ మీడియాలో విప‌రీత‌మైన క్రేజ్ రావ‌టం విశేషం.. భీన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు