ఆయన ఇంకా మాట్లాడుతూ, “కోపం, ఆవేశం తో సెర్గీ ఇద్దరు పిల్లలని టీనేజ్ లో చంపేస్తాడు. ఆ తర్వాత అతను ఈజీగా ఎస్కెప్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ అతనలా చేయకుండా ఉన్నాడు. అందుకు కూడా ఒక జస్టిఫికేషన్ ఉంది: చనిపోయిన ఇద్దరూ చెడ్డ వ్యక్తులు అని అతను భావించడం తో, ఆపుకోలేనటువంటి కోపావేశం తో అతను ఈ భూమి మీద నుంచి ఇద్దరిని చంపేశా అని భావించాడు. ఆ కోపమే ఈ కథ కి ఆయువుపట్టు.” అని చెప్పారు.
క్రావెన్: ది హంటర్ సినిమా ఆద్యంత యాక్షన్ ఎలిమెంట్స్ తో అలరిస్తుంది. మార్వెల్ కి సంబందించిన ఒక ఐకానిక్ విలన్ కథ ని మనం ఇందులో చూడొచ్చు. ఆరాన్ టేలర్-జాన్సన్, అతని గ్యాంగ్స్టర్ తండ్రి నీఙ్కళై తో ఉండే పగ, ప్రతీకారం ఈ సినిమా లో చూడొచ్చు.
చాందర్ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా లో అరియానా డీ బోస్, ఫ్రెడ్ హెచ్చింగర్, అలెసాండ్రో నీవోలా, క్రిస్టోఫర్ అబ్బాట్ మరియు రస్సెల్ క్రౌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమా జనవరి 1 న ఇంగ్లీష్, హిందీ, తమిళ్, మరియు తెలుగు భాషల్లో విడుదల కానుంది.