కృష్ణంరాజుకు తీవ్ర అస్వస్థత.. ఐసీయూలో చికిత్స

గురువారం, 14 నవంబరు 2019 (10:20 IST)
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ హీరో, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత కొంతకాలంగా న్యూమోనియాతో బాధపడుతున్న ఆయనకు బుధవారం అస్వస్థతకు లోనుకావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించి అత్యవసర సేవల విభాగం (ఐసీయూ)లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 
 
ప్రస్తుతం 79 యేళ్ళ కృష్ణంరాజు బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనను పరీక్షించిన వైద్య నిపుణులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది. కృష్ణంరాజు ఆరోగ్య పరిస్థితికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు