అమితాబ్ ఆరోగ్యం భేష్.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

శనివారం, 19 అక్టోబరు 2019 (09:34 IST)
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఆరోగ్యం కుదుటపడింది. ఫలితంగా ఆయన్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బిగ్ బి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 
 
కాలేయ సంబంధింత వ్యాధితో మంగ‌ళవారం తెల్ల‌వారుజామున 3 గంటలకు ముంబైలోని నానావ‌తి ఆసుప‌త్రిలో అమితాబ్‌ను చేర్చిన విషయం తెల్సిందే. అప్పటి నుంచి ఆయన నాలుగు రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. దీంతో ఆయన అభిమానులు ఎంత‌గానో ఆందోళ‌న చెందారు. ఆయ‌న‌కి ఏమైందో తెలుసుకునే ప్ర‌య‌త్నాలు చేశారు. రెగ్యుల‌ర్ చెక‌ప్ కోస‌మే అమితాబ్ వ‌చ్చార‌ని వైద్యులు చెప్ప‌డంతో అభిమానులలో ఆందోళ‌న తొల‌గి పోయింది. 
 
ఈ పరిస్థితుల్లో అమితాబ్‌ను శుక్రవారం రాత్రి వైద్యులు డిశ్చార్జ్ చేశారు. తన కాలేయం 75 శాతం దెబ్బతిందని ఇటీవల అమితాబ్ బచ్చన్ ఓ కార్యక్రమంలో వెల్లడించిన సంగ‌తి తెలిసిందే. తాను టీబీ, హెపటైటిస్ బి వ్యాధుల నుంచి కోలుకున్నానని కూడా చెప్పారు. 
 
ప్ర‌స్తుతం కౌన్‌బ‌నేగా క‌రోడ్ ప‌తి సీజ‌న్ 11 కార్య‌క్ర‌మంతో బిజీగా ఉన్న అమితాబ్.. 'సూజిత్ సర్కార్ గులాబో సితాబ్' అనే చిత్రంలో న‌టిస్తున్నారు. 'బ్ర‌హ్మాస్త్ర' అనే చిత్రంలోను కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఇటీవ‌ల అమితాబ్ సినిమా రంగానికి చేసిన సేవ‌ల‌కిగాను 'దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్' పొందిన విష‌యం తెలిసిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు