బాహుబలి సినిమా ద్వారా శివగామిగా అదరగొట్టిన రమ్యకృష్ణను ఆమె భర్త, దర్శకుడు కృష్ణవంశీ భరించలేనని చెప్తున్నారు. ప్రస్తుతం "నక్షత్రం" సినిమాను విడుదల చేసే పనుల్లో బిజీ బిజీగా ఉన్న కృష్ణవంశీ.. తన భార్య రమ్యను మాత్రం తన సినిమాల్లో నటింపజేసే ఉద్దేశం లేదంటున్నారు. అసలు తన సినిమాల్లో ఆమెకు ఛాన్స్ ఇవ్వనని అన్నారు. రమ్యను ఒక ఆర్టిస్టుగా చూడలేనని స్పష్టం చేశారు. తమకు వ్యక్తిగత సంబంధం ఉన్న కారణంగా ఆమెను ఆర్టిస్టుగా చూసే, భరించే మనస్తత్వం లేదన్నారు. అందుకే తమ కాంబినేషన్‌లో సినిమా రాదని కృష్ణవంశీ స్పష్టం చేశారు.
కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘చంద్రలేఖ’ సినిమాలో రమ్య ప్రధాన పాత్రను పోషించింది. ఆ తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వివాహానంతరం కూడా రమ్య నటిగా కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. మరోవైపు కృష్ణవంశీ కూడా దర్శకుడిగా బిజీగానే ఉన్నారు. ఈ క్రమంలో కృష్ణవంశీ హోం ప్రొడక్షన్‌లో వచ్చిన ‘శ్రీ ఆంజనేయం’ సినిమాలో ఫుల్ లెంగ్త్ పాత్రలో ఆమె కనిపించలేదు.
బాహుబలి’ సినిమాలో రమ్య నటన చాలా బాగుంది. ఇంకా ఆ పాత్ర పండేందుకు రచయిత, దర్శకుడే కారణం. ఆ క్యారెక్టర్‌ను చాలా బాగా రాశారు. తను మంచి నటని అని ‘అమ్మోరు’, ‘నరసింహ’ సినిమాలతోనే రమ్య నిరూపించుకుందని కృష్ణవంశీ తెలిపారు. కానీ ఆమెను తాను డైరక్ట్ చేయలేనని ఆయన తేల్చేశారు.