ఉప్పెన చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో క్రిష్-వైష్ణవ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు కూడా మంచి బిజినెస్ జరుగుతుందని అనుకుంటున్నారు ట్రేడ్ అనలిస్టులు. క్రిష్ ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తాడని గతంలో వార్తలు రాగా..మరి థియేటర్లలో రిలీజ్ అవుతుందా..? ఓటీటీలోనా అనేది తెలియాల్సి ఉంది.
ఇక కొసమెరుపు ఏంటంటే? వైష్ణవ్ తేజ్ టాలీవుడ్‌లో మెగాస్టార్ స్థాయికి ఎదిగే అవకాశం వుందని సినీ పండితులు అంటున్నారు. ఇందుకు కారణం ఏంటంటే? వైష్ణవ్ తేజ్ ఉప్పెనకు ముందు క్రిష్ సినిమా అట్టహాసంగా ప్రారంభమైంది. ఇంకా ఉప్పెనకు ముందే ఈ సినిమా రిలీజ్ కావాల్సింది. అయితే టెక్నికల్ కారణాలతో ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు. దీంతో ఉప్పెన సినిమా తెరపైకి వచ్చి బంపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.
అలాగే వైష్ణవ్ తేజ్ నటన, బాడీ లాంగ్వేజ్, కంటి చూపు వంటివి అతని బాగా ప్లస్ అయ్యాయని టాక్ కూడా వచ్చింది. ఇంకా మరో సెంటిమెంట్ కూడా ఉప్పెన హీరోకు కలిసొస్తుందని వినికిడి. ఎలాగంటే మెగాస్టార్ చిరంజీవి తొలి సినిమా పునాదిరాళ్లు కూడా విడుదల కాలేదు.