సినీ కెరీర్‌లో కొత్త దశను ఆస్వాదిస్తున్నా : కృతిసనన్

ఠాగూర్

మంగళవారం, 3 డిశెంబరు 2024 (10:27 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు టాటా చెప్పేసిన బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ ఇపుడు నిర్మాతగా రాణిస్తున్నారు. మహేశ్ బాబు నటించిన '1 నేనొక్కడినే' చిత్రంతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన నటి కృతిసనన్ .. తదుపరి 'దోచేయ్' చిత్రంలో మెరిసింది. అయితే రెండు చిత్రాలు ఆమెకు తీవ్ర నిరాశపరిచాయి. దీంతో తెలుగు చిత్రపరిశ్రమకు దూరమై హిందీ చిత్రాల్లో వరుసగా నటిస్తూ వచ్చారు. ప్రస్తుతం ఆమె నిర్మాతగా మారారు. .. బ్లూ బటర్ ఫ్లై ఫిల్మ్స్ నిర్మాణ సంస్థను స్థాపించింది.
 
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె నిర్మాతగా తన ప్రయాణం గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. కేరీర్‌లో కొత్త దశను ఆస్వాదిస్తున్నానని, తన నిర్మాణ సంస్థ ద్వారా మరికొన్ని సీతాకోకచిలుకలు రాబోతున్నాయని చెప్పింది. ఇందుకోసం భారతీయ సినిమాలో తెరపైకి రాని కథల కోసం రీసెర్చ్ చేస్తున్నట్లు పేర్కొంది. ఇదే సందర్భంలో తన లక్ష్యాన్ని కూడా కృతిసనన్ వెల్లడించింది.
 
సినీ ప్రేమికులను ఆశ్చర్యపరిచే చిత్రాలను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కృతిసనన్ తెలిపింది. సమాజానికి ఉపయోగపడే చిత్రాలను నిర్మించే స్థాయికి భవిష్యత్తులో చేరుకుంటానని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇప్పటివరకూ నటించిన పాత్రలను సృష్టించుకునే అవకాశం తనకు ఉండటం సంతోషంగా ఉందని పేర్కొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు