నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 25 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. కాగా ఈ నెల 21 న 'భీమ్లా నాయక్' ప్రీ రిలీజ్ వేడుక వైభవంగా నిర్వహించటానికి చిత్ర బృందం సంకల్పించింది. హైదరాబాద్, యూసుఫ్ గూడ లోని పోలీస్ గ్రౌండ్స్ లో ఈ వేడుక సాయంత్రం 6.30 నిమిషాలకు ప్రారంభ మవుతుంది. ఈ వేడుకకు తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ కె.టి.ఆర్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన్ను ఆహ్వానించేందుకు శనివారంనాడు కె.టి.ఆర్.ను త్రివిక్రమ్, నిర్మాత రాధాకృష్ణ వెళ్ళారు. ఆయన సాదరంగా ఆహ్వానించి ఏర్పాట్ల గురించి సినిమా గురించి వివరాలు తెలుసుకున్నారు.