భీమ్లా నాయక్ ను వీలుచూసుకుని విడుదల చేద్దాం అనుకున్నాం. కానీ గత ప్రెస్ మీట్ల్ లో సీఎం జగన్ గారి పేరు చెప్పినందుకు దాన్ని మరోలా అనుకున్నారు. పెద్ద సినిమా కాబట్టి నాలుగు షోస్ కు అనుమతి ఉన్నప్పుడే విడుదల చేయాలి. ఆ కోణంలో నేను అంటే దాన్ని కొందరు వేరే రకంగా మార్చేశారు. సరే అయిందేదో అయింది. ఇవాళ చిరంజీవి గారు ఇతర పెద్దలు వెళ్లి సీఎంతో మాట్లాడారు. సానుకూలంగా నిర్ణయాలు ఉంటాయని ఆశిస్తున్నాం. అన్నీ బాగుంటే ఈ నెల 25నే భీమ్లా నాయక్ ను విడుదల చేస్తాం. సినిమా కంటెంట్ రెడీగా ఉంది అని క్లారిటీ ఇచ్చారు.