బాలీవుడ్ నటులు సోనూసూద్, దిశాపటానీ, అమైరా దస్తూర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కుంగ్ ఫు యోగా సినిమా ట్రైలర్ రిలీజైంది. అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను దిశాపటానీ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకున్నారు.
చాలా సరదాగా ఈ ట్రైలర్‌ను చూపించారు. ఇందులో దిశాపటానీ యువరాణి పాత్రలో, సోనూసూద్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. చైనీస్ భాషలో ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్‌తో ట్రైలర్‌ను విడుదల చేశారు. స్టాన్లీ టాంగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జనవరి 28న విడుదల చేసేందుకు రంగం సిద్ధం అవుతుంది.