వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ పలు వివాదాలతో తెరకెక్కించిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ని నిలిపివేయాలని కోరుతూ తెదేపా కార్యకర్త దేవీబాబు చౌదరి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసారు. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న ఎన్నికలపై ప్రభావం చూపేలా ఉందనీ ఆయన తన ఫిర్యాదులో పేర్కొంటూ ఈ నెల 22న విడుదల కానున్న ఈ చిత్రాన్ని ఆపాలని కోరారు.
సినిమాలో ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రను నెగిటివ్‌గా చూపించారనీ, తత్ఫలితంగా ఇది ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని అభ్యంతరం వ్యక్తం చేసారు. ఈ చిత్రం విడుదలను ఏప్రిల్ 11వ తేదీ వరకు నిలిపివేయాలని విజ్ఞప్తి చేసారు. ఈ ఫిర్యాదుని స్వీకరించిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ... పరిశీలన నిమిత్తం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి పంపినట్లు సమాచారం.