సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజా చిత్రం "లక్ష్మీస్ ఎన్టీఆర్''. ఈ చిత్రంలో ఈనెల 22వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రస్తుతం మిగిలిపోయిన షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలో స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవితంలో ఎన్టీఆర్‌గా ప్రమఖ రంగస్థల నటుడు విజయ్ కుమార్ నటిస్తున్నారు. అలాగే, లక్ష్మీపార్వతిగా యజ్ఞాశెట్టి కనిపించనుంది.
కల్యాణీ మాలిక్ సంగీతం అందించిన ఈ సినిమా మార్చి 22వ తేదీ విడుదలకు సిద్ధం అవుతుండగా సినిమాకు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలను వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రచార చిత్రాలను, ట్రైలర్‌లను విడుదల చేసిన వర్మ.. ప్రమోషన్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ వీడియో ప్రోమోను దర్శకుడు వర్మ విడుదల చేశాడు.