మోహన్ లాల్ 'లూసిఫెర్'... 4 రోజులలో 50 కోట్లు

సోమవారం, 1 ఏప్రియల్ 2019 (15:23 IST)
మొదటి నుంచి కూడా వైవిధ్యభరితమైన కథా చిత్రాలతోనే ముందుకు సాగుతున్న మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్. తన హవాని ఏ మాత్రం తగ్గనివ్వకుండా అలాగే కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇటీవల నటించిన మలయాళ చిత్రం 'లూసిఫెర్' గత నెల 28వ తేదీన విడుదలైంది. 
 
ఈ సినిమా విడుదలైన తొలి 4 రోజుల్లోనే 50 కోట్ల రూపాయల గ్రాస్‌ను వసూలు చేయడం విశేషం. మలయాళంలో చాలా తక్కువ సమయంలో ఈ స్థాయి వసూళ్లను సాధించిన తొలి చిత్రంగా ఇది కొత్త రికార్డును నెలకొల్పింది.
 
నూతన దర్శకుడు... పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ సినిమా వసూళ్లపరంగా తన జోరును కొనసాగిస్తూనే వుంది. ఇందులో వివేక్ ఒబెరాయ్, మంజు వారియర్ ఇతర ముఖ్య పాత్రలను పోషించారు. మోహన్ లాల్ నుంచి ఇంతకుముందు వచ్చిన 'ఒడియన్'.. పరాజయం కావడంతో డీలాపడిన ఆయన అభిమానులు, 'లూసిఫెర్' సక్సెస్‌తో సంబరాలు చేసుకుంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు