ఈ చిత్రం విడుదలైన తొలి ఆట నుంచే కలెక్షన్ల వర్షం కురుస్తోంది. గత నాలుగు వారాల్లో ఈ చిత్రం ఏకంగా రూ.200 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఈ చిత్రం విడుదలైన 28 రోజుల్లో రూ.200.07 కోట్లను వసూలు చేసింది. ఈ చిత్రం రూ.225 కోట్ల దిశగా పరుగులు తీస్తోందని ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.
ఈ చిత్రం గత సోమవారం రూ.2.86 కోట్లు, మంగళవారం రూ.2.63 కోట్లు, బుధవారం రూ.2.40 కోట్లు, గురువారం రూ.2.19 కోట్లు, శుక్రవారం రూ.3.44 కోట్లు, శనివారం రూ.6.62 కోట్లు, ఆదివారం రూ.8.88 కోట్లు చొప్పున మొత్తం రూ.200.07 కోట్లను వసూలు చేసింది.