ట్రూగా మోదీ దుర్మార్గుడు.. సినిమాకెళ్తే.. జాతీయగీతం ఏంటి..?

మంగళవారం, 18 డిశెంబరు 2018 (14:03 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై బీజేపీలో చేరిన సినీ నటి మాధవీలత వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. తాను బీజేపీలో చేరిన తర్వాతే మోదీ నిజ స్వరూపం గురించి తెలుసుకుందామని.. ఆయన దుర్మార్గుడని తేలిపోయిందని మాధవీలత వెల్లడించింది. 
 
ఫేస్‌బుక్‌లో మాధవీలత చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ అయ్యింది. తాను బీజేపీలో జాయిన్ అయ్యాకే అసలు దేశానికి బీజేపీ నిజంగా సహాయం చేస్తుందా.. నాశనం చేస్తుందా అని తెలుసుకోవటానికి ఆస్కారం దొరికిందని చెప్పింది. అసలు ట్రూగా మోదీ దుర్మార్గుడని మాధవీ లత సంచలన వ్యాఖ్యలు చేసింది.
 
రోజు ఆయన ఏమి చేస్తాడో చెప్తా వినండి. ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్‌లో జాతీయగీతం పాడాను. కానీ ఇప్పుడు జాతీయ గీతాన్నిమరిచిపోయాను. ఎవరికి కావాలి ఆ గీతం.. మీటింగ్స్ పెట్టి జాతీయ గీతం పాడుకోవచ్చు. 
 
కానీ సినిమాలకు ఎంజాయ్ చేద్దామని మూవీకి పోతే.. జాతీయగీతమా..? ఏమయ్యా మోదీ మాకు అవసరమా? మజా చేద్దామని సినిమాకు పోతే దేశభక్తి ఏంటి మాకు? ఛీ పనిపాట లేని పనులు మీరు.. మాకు ఇలాంటివి వద్దు. మేం పక్కా లోకల్ అంటూ పాడుకుంటే కిక్ వస్తది. అయ్యా మోడీ నీకు దేశభక్తి ఉంటే నువ్ పాడుకో.. మాకెందుకు రుద్దడం నీవల్ల దేశానికి ఏం ఉపయోగం అంటూ మాధవీలత ప్రశ్నించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు