ఇక అసలు విషయానికి వస్తే... జూనియర్ ఎన్టీఆర్‌ను సీనియర్ ఎన్టీఆర్ ఓసారి పిలిచి మాట్లాడారట కదా అని యాంకర్ ప్రశ్నించింది. దీనికి లక్ష్మీపార్వతి సమాధానం చెప్తూ... వాళ్లని పిలిపించింది తనేననీ, ఐతే ఇంటికి వచ్చిన జూ.ఎన్టీఆర్ తన ఫోటోను చించి అవతల పడేశాడంటూ ఉద్వేగానికి లోనయ్యారు.
ఇంకా ప్రతిరోజూ షాలిని... జూ.ఎన్టీఆర్ తల్లి నాకు ఫోన్ చేసి, అది కావాలి అత్తయ్యగారు, ఇది కావాలి అత్తయ్యగారూ అంటూ అడిగేది. ఒకటే ఫోనులు అంటూ ఆనాటి విషయాలను వెల్లడించింది. నారా లోకేష్ గురించి చెపుతూ... తెలుగు స్పష్టంగా మాట్లాడించడానికి అల్లుడు చంద్రబాబు అతడి కోసం పది లక్షలు ఖర్చు పెట్టి ట్యూషన్ చెప్పించినా ఫలితం లేకుండా పోయిందని సెటైర్లు వేశారు. లోకేష్ కి అటు ఆంగ్లం కానీ ఇటు తెలుగు కానీ రాదు. ఇలా భాషనే సరిగా మాట్లాడలేని వ్యక్తిని తీసుకొచ్చి ప్రజల మీద రుద్దారంటూ విమర్శనాస్త్రాలు సంధించారు.