మహాసముద్రం సినిమా క్యారెక్టర్‌ రివీలింగ్ మోషన్‌ పోస్టర్‌

గురువారం, 29 జులై 2021 (16:25 IST)
Sharvanand, Siddharth
శర్వానంద్, సిద్దార్థ్‌ హీరోలుగా నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘మహాసముద్రం’. అనూ ఇమ్మాన్యుయేల్, అదితీరావ్‌ హైదరీ హీరోయిన్లుగా నటించారు.‘మహాసముద్రం’ క్యారెక్టర్‌ లుక్స్‌ పోస్టర్స్‌ను బట్టి సినిమాలోని ప్రతి పాత్రకు ప్రాముఖ్యం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన శర్వానంద్, సిద్దార్థ్, అదితిరావ్‌ హైదరీ, అనూ ఇమ్మాన్యుయేల్, జగపతిబాబు, రావు రమేష్, గరుడ రామచంద్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తుంది.
 
మహాసముద్రం షూటింగ్‌ ఇటీవలే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ శరవేగంగా జరుగుతున్నాయి. థియేటర్స్‌లో విడుదల అయ్యేందుకు ఈ చిత్రం రెడీ అవుతుంది. ఈ సందర్భంగా రానున్న కొద్ది రోజుల్లో ఈ సినిమా నుంచి ప్రేక్షకులకు ఆసక్తికరమైన అప్‌డేట్స్‌ ఇచ్చేందుకు చిత్రయూనిట్‌ రెడీ అవుతుంది. లేటెస్ట్‌గా ఈ సినిమాలోని క్యారెక్టర్స్‌ మోషన్‌ పోస్టర్‌ను చిత్రయూనిట్‌ విడుదల చేసింది.
 
మోషన్‌ పోస్టర్‌లో కనిపిస్తున్న ‘మహాసముద్రం’లోని ఇంటెన్స్‌ క్యారెక్టర్స్‌ సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి. ఇక ఫీరోసియస్‌గా కనిపిస్తున్న హీరోలు శర్వాందన్, సిద్దార్థ్‌ల లుక్స్, తాజా కొత్త పోస్టర్స్‌ అవుట్‌స్టాండింగ్‌గా ఉన్నాయి. సిద్దార్థ్‌ గన్‌ పట్టు కోవడం, శర్వానంద్  కోపోద్రోక్తుడై నడుచుకుంటూ రావడం మోషన్‌ పోస్టర్‌లో కనిపిస్తుంది. సంగీత దర్శకుడు చేతన్‌ భరద్వాజ్‌ ఈ చిత్రంలోని క్యారెక్టర్స్‌కు ఇచ్చిన ఎలివేషన్స్‌ ప్రత్యేకమైనవని చెప్పవచ్చు. ఇక బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ అయితే అదిరిపోయేలా ఉంది.
 
ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సుంకర రామబ్రహ్మాం ఈ లవ్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ మూవీని నిర్మిస్తున్నారు. రాజ్‌తోట ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి  చేతన్‌ భరద్వాజ్‌ సంగీతం అందిస్తున్నారు. ప్రవీణ్‌ కేఎల్‌ ఎడిటర్‌ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, అవినాష్‌ కొల్ల ప్రొడక్షన్‌ డిజైనర్‌గా వర్క్‌ చేశారు. ర‌చ‌న, ద‌ర్శ‌క‌త్వం: అజ‌య్ భూప‌తి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు