హైదరాబాద్‌కు చెందిన ఆకాష్‌ ఇనిస్టిట్యూట్‌ విద్యార్ధి సిద్ధార్ధ్‌ మల్లెల ఐఓక్యుబీలో తెలంగాణా స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌

బుధవారం, 7 జులై 2021 (22:03 IST)
కూకట్‌పల్లిలోని ఆకాష్‌ ఇనిస్టిట్యూట్‌ విద్యార్ధి సిద్దార్థ్‌ మల్లెల అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇండియన్‌ ఒలింపియాడ్‌ క్వాలిఫయర్‌ ఇన్‌ బయాలజీ (ఐఓక్యుబీ) పరీక్షలో టాపర్‌గా నిలిచాడు. భారతీయ జాతీయ స్థాయి సైన్స్‌ ఒలింపియాడ్‌ రెండవ దశ పరీక్ష ఐఓక్యుబీలో తెలంగాణా రాష్ట్రంలో మొదటి ర్యాంకును సాధించాడతను. ఈ పరీక్షను బయలాజికల్‌ సైన్సెస్‌లో టీచర్ల సంఘం, ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజిక్స్‌ టీచర్స్‌ మరియు హోమి బాబా సెంటర్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ (హెచ్‌బీసీఎస్‌ఈ) సహకారంతో నిర్వహించింది. ఈ పరీక్ష కోసం 12వ తరగతి ఆ లోపు విద్యార్థులు 30 వేల మంది హాజరయ్యారు.
 
ఐఓక్యుబీ పరీక్షను 12 వ తరగతి విద్యార్థుల కోసం ఉద్దేశించినదే అయినప్పటికీ 11వ తరగతి విద్యార్థులు సైతం పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు. ఈ పరీక్షలో రాష్ట్రాల వారీ కోటా ప్రకారం విద్యార్థులను తరువాత దశ పోటీలకు ఎంపిక చేస్తారు. అదే సమయంలో జాతీయ స్థాయిలో సరాసరి టాప్‌టెన్‌ స్కోర్స్‌ 80%కు పైగా ఉంటే రాష్ట్రాల కోటాతో సంబంధం లేకుండా తరువాత దశ పరీక్షకు ఎంపిక చేస్తారు.
 
అద్భుతమైన ఫలితాన్ని సాధించిన సిద్ధార్ధ్‌ను అభినందించిన శ్రీ ఆకాష్‌ చౌదరి, మేనేజింగ్‌ డైరెక్టర్‌, ఆకాష్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఏఈఎస్‌ఎల్‌) మాట్లాడుతూ, ‘‘ఈ కష్టకాలంలో కూడా మా విద్యార్థి అసాధారణ ఫలితాలను సాధించడం పట్ల మేము చాలా గర్వంగా ఉన్నాము. ఐఓక్యుబీ పరీక్షను  క్లియర్‌ చేసిన అతన్ని మేము అభినందిస్తున్నాము. నీట్‌/జెఈఈ కలను సాకారం చేసుకునే దిశగా ఇది ఓ చక్కటి మందడుగు. మా విద్యార్థుల కష్టం, ఫ్యాకల్టీల సూచనలతో పాటుగా ఇనిస్టిట్యూట్‌ వద్ద విద్యార్థులకు అందిస్తున్న శిక్షణకు ప్రతిరూపంగా నిలుస్తుందిది’’ అని అన్నారు.
 
ఐఓక్యుబీలో టాప్‌ స్టూడెంట్స్‌ ప్రదర్శన అనుసరించి ప్రతిభావంతులను స్టేజ్‌ 3 ఓరియెంటేషన్‌ క్యాంప్‌ (ఓసీ)కి ఎంపిక చేస్తారు. ఎంపికైన విద్యార్థులకు హెచ్‌బీసీఎస్‌ఈ వద్ద థియరీ, ప్రయోగాలలో శిక్షణ అందిస్తారు. అంతర్జాతీయ ఒలింపియాడ్‌లో భారతీయు విద్యార్థులు (ప్రతి సబ్జెక్ట్‌లోనూ 4-6 మంది) పాల్గొనడంతో ఈ ఒలింపియాడ్‌ ప్రోగ్రామ్‌ ముగుస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు