వాయిదా పడిన మహర్షి 50 రోజుల వేడుక..

గురువారం, 27 జూన్ 2019 (14:25 IST)
మహేష్ బాబు, పూజా హెగ్డే , అల్లరి నరేష్ ప్రధాన తారాగణంతో వంశీ పైడిపల్లి తెరకెక్కించిన చిత్రం మహర్షి వేసవి కానుకగా విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసుకుంది.


ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ సినిమా, వైజయంతి మూవీస్‌ బ్యానర్లపై దిల్‌రాజు, పొట్లూరి ప్రసాద్‌, అశ్వినీదత్‌ సంయుక్తంగా నిర్మించారు. యువకెరటం దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించిన ఈ చిత్రం నేటితో (జూన్ 27)తో 50 రోజులు పూర్తి చేసుకుంది. 
 
ఈ సినిమా ప్రస్తుతానికి 200 కేంద్రాల్లో విజయవంతంగా న‌డుస్తుండ‌డంతో చిత్ర యూనిట్ జూన్ 28వ తేదీన హైదరాబాద్ శిల్పకళా వేదికగా 50 రోజుల వేడుకని ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని భావించింది. కాగా ప్రముఖ నటి, దర్శకురాలు విజయ నిర్మల హఠాన్మరణంతో మహర్షి 50 రోజుల వేడుకను వాయిదా వేస్తున్నట్లు శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేషన్స్ సంస్థ త‌మ ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించింది. 
 
విజయ నిర్మల అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరగనుండగా సూపర్ స్టార్ కృష్ణ కుటుంబ సభ్యులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో మహర్షి 50 రోజుల వేడుక వాయిదా పడినట్లు తెలుస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు