''మహర్షి'' వసూళ్లు అదుర్స్.. కర్ణాటకలో రూ.6.07 కోట్లు

మంగళవారం, 14 మే 2019 (17:19 IST)
మహేష్ బాబు తాజా చిత్రం 'మహర్షి' మే 9న భారీ అంచనాలలో విడుదలైంది. ఈ సినిమాకి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ  బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం డీసెంట్ కలెక్షన్స్ నమోదు చేస్తోంది. పక్క రాష్ట్రమైన కర్ణాటకలో మాత్రం మహర్షి తన జోరును చూపిస్తోంది.
 
వసూళ్లు భారీగానే రాబడుతోంది. మొదటి వీకెండ్‌లో అంటే ఆదివారం వరకూ కర్ణాటకలో రూ. 6.07 కోట్లు షేర్ వసూలు చేసింది. ఇందులో రూ. 3.45 కోట్లు బెంగుళూరు నగరం నుంచి వచ్చిన కలెక్షన్స్. కర్ణాటకలో మహేష్‌కి ఎంత క్రేజ్ ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. 
 
ఇదే రేంజ్‌లో మహర్షి దూకుడు ప్రదర్శిస్తే హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రాలలో స్థానం సంపాదించడం ఖాయమని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. సమ్మర్ హాలిడేస్ కావడంతో ఈ సినిమాకి ఇదొక అడ్వాంటేజ్ అని చెప్పాలి. 
 
దీనితో పోటీ పడేందుకు మరో రెండు వారాల దాకా చెప్పుకోదగ్గ సినిమాలు ఏవి లేకపోవడంతో మహర్షికి ప్లస్ పాయింట్ అయింది. మహర్షి సినిమాను భారీ రేట్లకు అమ్మడంతో బ్రేక్ ఈవెన్ అయ్యేందుకు ఇంకా చాలా దూరం పయనించాల్సి ఉంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు