సూపర్ స్టార్ మహేష్ బాబు - సక్సస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ చిత్రం సరిలేరు నీకెవ్వరు. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ జరుపుకుంటోంది. మహేష్ సరసన రష్మిక నటిస్తుంది.
ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉంటే... బన్నీ నటిస్తున్న తాజా చిత్రం అల...వైకుంఠపురంలో.. ఈ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్నారు. గీతా ఆర్ట్స్, హారిక & హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాని కూడా సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్టు ఎనౌన్స్ చేసారు.
ఈ వార్‌తో అలర్ట్ అయిన సరిలేరు నీకెవ్వరు నిర్మాతలు, అల..వైకుంఠపురంలో నిర్మాతలు ఓ నిర్ణయానికి వచ్చారట. అది ఏంటంటే... ఈ రెండు సినిమాలను ఒకేరోజు రిలీజ్ చేయకూడదు. ఒక రోజు రెండు రోజులు కాదు ఏకంగా నాలుగు రోజుల గ్యాప్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. దీంతో ఈ ఇద్దరి ఫ్యాన్స్ మధ్య వార్ తగ్గుతుంది అనేది ఆయా చిత్ర నిర్మాతల ఆలోచన. మరి... ఈ ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.