ప్రశాంతంగా పడుకున్నాను... అడివి శేష్‌

శనివారం, 17 ఆగస్టు 2019 (21:31 IST)
అడివి శేష్ న‌టించ‌ని తాజా చిత్రం ఎవ‌రు. ఈ సినిమా రిలీజ్ అయిన ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచే బ్లాక్ బ‌ష్ట‌ర్ టాక్ సొంతం చేసుకుని సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. విడుద‌లైన అన్ని చోట్ల రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తూ సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. ఈ సంద‌ర్భంగా అడివి శేష్ త‌న స్పంద‌న‌ను తెలియ‌చేస్తూ...” దిల్ రాజు గారికి థాంక్స్. అలాగే భాను గారు, శిరీష్ గారు మా సినిమాను కరెక్ట్ టైంలో రిలీజ్ చేయడానికి హెల్ప్ చేశారు. 
 
చాలా కాలం తరువాత నిన్న ప్రశాంతంగా పడుకున్నాను. రాజు గారు ప్రొడ్యూస్ చేసిన ఎవడు సినిమాలో విలన్ క్యారెక్టర్ కోసం చాలా ప్రయత్నం చేశాను కానీ కుదరలేదు. ఇప్పుడు ఎవరు సినిమా చూశాక దిల్ రాజు గారు ఫోన్ చేసి నా బ్యానర్ లో సినిమా ఎప్పుడు చేస్తున్నావ్ అని అన్నారు. అది నాకు చాలా సంతోషం అనిపించింది. 
 
కలెక్షన్స్ గురించి నాకు ఎక్కువ తెలీదు కానీ గూఢచారి మూడు రేట్లు ఎక్కువ ఓపెన్ అయింది అని తెలిసింది. నిన్న థియేటర్స్‌కి వెళ్ళినప్పుడు ఆడియన్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా మమ్మల్ని కూడా పట్టించుకోకుండా బిజీగా సినిమా చూస్తున్నారు. హ్యాపీగా అనిపించింది. ఈ సినిమాలో మేము రాసిన ప్రతి జోక్ కి నవ్వారు.. ఇచ్చే ప్రతి ట్విస్ట్ కి క్లాప్ కొట్టారు” అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు