సంక్రాంతికి విడుదలైన రేసులో విడుదలైన రెండు భారీ సినిమాలపై సెలెబ్రిటీల జాబితాలో మరో స్టార్ హీరో చేరిపోయాడు. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు 'గౌతమిపుత్ర శాతకర్ణి', చిరు 'ఖైదీ నెం.150'పై స్పందించాడు. రెండు సినిమాలపై స్పందించడానికి ట్విట్టర్‌ను వేదికగా చేసుకున్నాడు.
''వెల్‌కమ్ బ్యాక్ సార్. మీకు, చిత్ర యూనిట్ సభ్యులకు కంగ్రాట్స్''అని చిరు సినిమాని ఉద్దేశించి ట్వీట్ చేశాడు. బాలయ్య 'గౌతమిపుత్ర శాతకర్ణి'పై స్పందించిన మహేశ్ ''హేట్సాఫ్ బాలకృష్ణ గారు. గౌతమిపుత్ర శాతకర్ణి చరిత్రను అద్భుతంగా చూపించిన చిత్ర యూనిట్ అభినందనలు.. అంటూ ట్వీట్ చేశారు. ఇంకా తెలుగు సినీ పరిశ్రమకు ఇలాంటి సినిమా అవసరమని... మీకు, సినిమా యూనిట్ సభ్యులకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశాడు.