టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తన అందం వెనుక గల రహస్యాన్ని బయటచెప్పేశారు. నాలుగు పదుల్లో కుర్రాడిలా కనిపించే మహేష్ బాబు అందానికి వెనుక సరైన ఆహారం, చక్కని నిద్ర, వర్కౌట్స్ కారణమని చెప్తున్నారు. ఇంకా సంతోషంగా ఉండటం కూడా తన అందానికి కారణమంటున్నారు.
ఆహారంలో విషయంలో నియమాలు పాటించడం.. ప్రోటీన్స్, కార్బొహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఎంతమేరకు కావాలో అంతే తీసుకుంటానని.. చికెన్, సీఫుడ్స్, ఎగ్ వైట్, ఆకుకూరలు బాగా లాగించడం చేస్తానని మహేష్ బాబు తెలిపారు. ఎక్కువ సేపు నిద్రపోవడం ఆరోగ్యానికి చాలా అవసరమని టాలీవుడ్ ప్రిన్స్ చెప్పుకొచ్చాడు. సింపుల్‌గా ఉండటం, క్యాజువల్ వేర్ ధరించడం అంటే తనకెంతో ఇష్టమని మహేష్ వెల్లడించాడు.