గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని బుర్రిపాలెం సూపర్‌స్టార్ కృష్ణ స్వగ్రామం. ఈ ఊరిని సూపర్‌స్టార్ మహేష్ 'శ్రీమంతుడు' సినిమా విడుదల సమయంలో దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్.. నియోజకవర్గ అభివృద్ధి నిధులతో బుర్రిపాలెం రోడ్లను, డ్రెయిన్లలను మరమ్మత్తులు చేయించారు.
ఇదిలా ఉంటే.. సౌత్ ఇండియా సార్ హీరో మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ మురుగదాస్‌ల కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాపై ప్రేక్షకుల్లో, సినీ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో మహేష్ కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం యొక్క బిజినెస్ తారా స్థాయిలో జరుగుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా సినీ వర్గాల నుడి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం యొక్క శాటిలైట్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడయ్యే ఛాన్స్ ఉందట.
ఓ ప్రముఖ టీవీ ఛానెల్ ఈ చిత్రం యొక్క శాటిలైట్, ఆడియో ఈవెంట్ హక్కుల కోసం సుమారు రూ. 18. 5 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వేరే షెడ్యూల్ కోసం త్వరలోనే అహ్మదాబాద్ వెళ్లనుంది.