టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు- మురుగదాస్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో.. శ్రీమంతుడు సినిమాతో హిట్ కొట్టిన మహేష్-కొరటాల కాంబోలో మరో సినిమా రూపుదిద్దుకోనుంది. ఇందులో మహేష్ బాబు సీఎం హోదాలో కనిపిస్తారని తెలుస్తోంది. ఈ చిత్రం మహేష్ బాబు కెరీర్‌ను మలుపు తిప్పుతుందని చెప్తున్నారు. ''భరత్ అనే నేను'' అనే టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది.
మురగదాస్ సినిమాలో నటిస్తూ ప్రస్తుతం బిజీబిజీగా మహేష్ ఈ సినిమా పూర్తయ్యాక.. కొరటాల చిత్రం షూటింగ్‌ల పాల్గొంటారని సమాచారం. రాజకీయ నేతగా మహేష్ కనిపించనుండటంతో ఆయన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇందులో మహేష్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే సీన్స్ ఉంటాయి. ఈ సినిమా షూటింగ్ మే ఐదో తేదీ ప్రారంభం కానుంది. ఇకపోతే మహేష్ బాబు- మురుగదాస్ సినిమా జూన్ 22వ తేదీ రిలీజ్ కానుంది.