తల్లి ఇందిర, కూతురు సితార ఫోటోతో ప్రిన్స్ మహేష్ బాబు ట్వీట్.. మరి నమ్రత ఫోటో ఎక్కడ?

బుధవారం, 8 మార్చి 2017 (12:39 IST)
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితారకు సోషల్ మీడియాలో యమా క్రేజుంది. ఇటీవల 'బ్రహ్మోత్సవం' సినిమాలో సమంత డైలాగు చెప్పిన సితార వీడియో ఒకటి షోషల్ మీడియాలో గతంలో హల్ చల్ చేసింది. ప్రస్తుతం సితారతో పాటు తన తల్లి ఫోటోను పోస్ట్ చేశాడు ప్రిన్స్. తద్వారా హీరో మహేశ్ బాబు మహిళల పట్ల తనకున్న గౌరవాన్ని మరోసారి చాటుకున్నాడు. 
 
తల్లి ఇందిర, కూతురు సితార ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. బీ బ్యూటిఫుల్, బీ లవ్డ్, బీ రిస్పెక్టెడ్, బీ ప్రౌడ్, బీ స్ట్రాంగ్, బీ హ్యాపీ అని మహేశ్ ట్వీట్ చేశాడు. మహేశ్ బాబు నేషనల్ గర్ల్ చైల్డ్‌డే రోజు కూడా కూతురి ఫోటోను పోస్ట్ చేసి తనకు దేవుడిచ్చిన గొప్ప వరం కూతురని ట్వీట్ చేశాడు. తన సంతోషం, తన గౌరవం అన్నీ సితారేనని పోస్ట్ చేశాడు. కూతుళ్లను కన్నందుకు తల్లిదండ్రులు గర్వంగా ఫీలవ్వాలని ట్వీట్ చేశాడు. 
 
అయితే భార్య ఫోటో కనిపించకపోవడంపై ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. అమ్మ, కుమార్తె ఫోటోను పెట్టిన ప్రిన్స్.. అర్థాంగి నమ్రత ఫోటో ఎందుకు పెట్టలేదని వారు ప్రశ్నిస్తున్నారు. మరి ఇందుకు ప్రిన్స్ ఎలాంటి సమాధానం ఇస్తాడో?

వెబ్దునియా పై చదవండి