చిరంజీవి అంకుల్.. మిమ్మలను చూసి ఈర్ష్యపడుతున్నా.. మంచు లక్ష్మీ

సోమవారం, 15 మార్చి 2021 (12:25 IST)
మెగాస్టార్ చిరంజీవిని చూస్తే నిజంగానే చాలా మందికి ఈర్ష్య కలుగుతుంది. ఎందుకంటే.. ఆరు పదుల వయస్సులోనూ నిత్య విద్యార్థిగా ఉంటాడు. తాను చేసే ప్రాజెక్టులు కోసం అహర్నిశలు శ్రమిస్తుంటారు. పైగా, తెలుగు చిత్రపరిశ్రమలోని ప్రతి ఒక్కరితోనూ స్నేహభావంతో మెలుగుతుంటారు. ఒక విధంగా చెప్పాలంటే టాలీవుడ్ ఆశాజశత్రువు చిరంజీవి. అందుకే చిరంజీవిని చూస్తే ప్రతి ఒక్కరికీ ఈర్ష్య కలుగుతుంది. ఇపుడు ఈ జాబితాలో మంచు లక్ష్మి కూడా చేరిపోయింది. దీనికి బలమైన కారణం లేకపోలేదు. అదేంటో ఇపుడు తెలుసుకుందాం. 
 
ఇటీవల లెజెండ్రీ యాక్టర్స్‌ చిరంజీవి, మోహన్‌బాబు కలిసి సిక్కింకు వీకెండ్‌ ట్రిప్‌ వెళ్లారు. ఈ విషయాన్ని మోహన్‌బాబు కుమార్తె, నటి మంచు లక్మి తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేశారు. "ఇద్దరు మాస్ట్రోలు సిక్కింకు శీఘ్ర పర్యటనకు వెళ్ళినప్పుడు.. అదొక ఫైరింగ్‌ న్యూస్‌ అవుతుందని మీకు తెలుసు. చిరంజీవి అంకుల్‌.. మీరు మాత్రమే నాన్నను వీకెండ్‌ క్విక్‌ ట్రిప్‌లో సిక్కింకు వెళ్లడానికని ఒప్పించగలిగారు. 
 
మిమ్మల్ని చూసి నేను ఈర్ష్య పడుతున్నాను. మీరు కలిసి అద్భుతమైన క్షణాలను గడపటం చాలా ఆనందాన్నిచ్చింది. హృదయం సంతోషంతో నిండిపోయింది. మీరు, పిల్లలు కలిసి ఓ రోజు ఇలాంటి ట్రిప్‌కు వెళదాం" అని అంటూ మంచు లక్ష్మి చిరంజీవి, మోహన్‌బాబు కలిసి ఉన్న ఓ ఫొటోను కూడా షేర్‌ చేశారు.

 

When two maestros go for a quick trip to Sikkim, you know it’s going to be

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు