స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించలేమన్న సుప్రీంతీర్పుతో గుండెపగిలిపోయింది...

గురువారం, 19 అక్టోబరు 2023 (14:10 IST)
దేశంలో స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించలేమంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గుండెపగిలిపోయినట్టయిందని నటి మంచు లక్ష్మి అభిప్రాయపడ్డారు. ఈ తీర్పుపై ఆమె గురువారం స్పందిస్తూ, సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయంతో తన గుండె పగిలిపోయిందన్నారు. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించలేమని సుప్రీంకోర్టు చెప్పడం తనకు తీవ్ర నిరాశకు గురి చేసిందన్నారు. 
 
మిగిలిన ప్రపంచానికి ప్రేమ గురించి బోధించిన మన దేశానికి ఇది నిజంగా అవమానకరమన్నారు. ఇతర దేశాల్లో ఉన్న స్వలింగ సంపర్కులు స్వేచ్ఛగా జీవితాన్ని గడుపుతున్నారని, మన దేశంలో వీరి వివాహాలను అంగీకరించలేమా? అని ఆమె ప్రశ్నించారు. 
 
కాగా, ఇటీవల స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించలేమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు, సుప్రీంకోర్టు తీర్పు పట్ల పలువురు సినీ సెలెబ్రిటీలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వారిలో మంచులక్ష్మి కూడా తాజాగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు