మంచు విష్ణుకూడా బాహుబలిలాంటి చిత్రం చేస్తున్నాడోచ్‌!

బుధవారం, 7 అక్టోబరు 2015 (12:08 IST)
వినడానికి ఆశ్చర్యంగా వున్నా... ఆ చిత్రంతో పోల్చుకోవడంలో తప్పులేదు. విశేషం ఏమంటే.. రచయిత, నటుడు తనికెళ్ళ భరణి.. దర్శకత్వంలో 'భక్త కన్నప్ప' అనే చిత్రం రూపొందించడానికి ప్లాన్‌ చేస్తున్నారు. ఓన్‌ నిర్మాణ సంస్థతోపాటు హాలీవుడ్‌ స్టూడియో భాగస్వామ్యంతో మంచు ఫ్యామిలీ సిద్ధం చేస్తుంది. ఈ చిత్రం గురించి ఇప్పటికే.. కసరత్తులు చేస్తున్నారు. 
 
హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌తో.. చిత్రాన్ని తీర్చిదిద్దడానికి.. అందులోనూ.. విజువల్‌పరంగా బాహుబలిని తలపించాలని ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాగంటే.. ఈ చిత్రంలో దక్షిణాది నాలుగు భాషల్లోని ఫేమస్‌ నటీనటుల్ని ఇన్‌వాల్వ్‌ చేయనున్నట్లు సమాచారం. ఇటీవలే యుఎస్‌ వెళ్ళి వచ్చిన మంచు విష్ణు.. అక్కడి సాంకేతిక సిబ్బందితో కథ గురించి చర్చించినట్లు ఫిలింనగర్‌ కథనాలు తెలిపాయి.

వెబ్దునియా పై చదవండి