"జటాజూటధారీ, నీకోసం తపస్సు చేసే నాకెందుకు ఈ పరీక్ష స్వామీ? #హరహరమహదేవ్" అంటూ ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మంచు విష్ణుకు ఎదురైన పరిస్థితి చూసి ఆయన అభిమానులు ఎక్స్ వేదికగా ధైర్యం చెబుతున్నారు.
ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేటు లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ కుమార్ వద్ద ఆఫీస బాయిగా పని చేసే రఘు అనే వ్యక్తి ఈ నెల 25న ఈ మూవీకి సంబంధించిన హార్డ్ డిస్క్‌ను తస్కరించి చరిత అనే మహిళకు అప్పగించాడు. అపహరణకు గురైన హార్డ్ డిస్క్ 1.30 గంటల సినిమా ఉందని, ముఖ్యంగా ప్రభాస్‌కు సంబంధించిన కీలక యాక్షన్ సీక్వెన్స్ అందులో ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో తమ ప్రాజెక్టుకు నష్టం కలిగించాలనే దురుద్దేశంతో రఘు, చరితలు కలిసి ఇలా చేస్తున్నారని విజయకుమార్ ఫిల్మ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.