ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాదను ప్రస్తుతం నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. దీంతో మన్మథుడు-2 సినిమాపై ఆ ప్రభావం పడుతుందానని నిర్మాతలు బాధపడిపోతున్నారు. గతంలో ''వయసు మళ్లిన హీరోలు తమ సినిమాలలో కూతురు వయసుండే హీరోయిన్స్‌తో రొమాన్స్ చేయడం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో జరుగుతూనే ఉంది. ఇది ఇంకా ఆగలేదు.. ఆగిందా..?'' అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఈ పోస్టే ప్రస్తుతం చిన్మయిని చిక్కుల్లో నెట్టింది.
అయితే ప్రస్తుతం మన్మథుడు-2ను ఆమె ప్రమోట్ చేసింది. ఇందుకు కారణం భర్త రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే. ఈ సినిమాలో హీరోగా నటించిన నాగార్జున వయసు 59.. తన వయసులో సగం కంటే తక్కువ ఉన్న హీరోయిన్లతో నటించాడు. ఇప్పుడు ఈ విషయంపై నెటిజన్స్ ఆమెను టార్గెట్ చేశారు. పబ్లిసిటీ కోసం అప్పట్లో పోస్టులు పెట్టి.. తన భర్తతో అలాంటి పనులను ప్రోత్సహిస్తున్నావా అంటూ ట్రోల్ చేస్తున్నారు.
తమిళ రైటర్ వైరముత్తు తనను లైంగికంగా వేధించాడంటూ సంచలన ఆరోపణలతో మీటూ ఉద్యమంలో యాక్టివ్‌గా పాల్గొన్న సింగర్ చిన్మయి.. సమాజంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై స్పందిస్తున్న సంగతి తెలిసిందే. మరి మన్మథుడు-2 ప్రమోషన్‌పై చిన్మయిని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఈ ట్రోలింగ్‌కు ఆమె ఎలాంటి బదులిస్తుందో వేచి చూడాలి.