'సుఖీభవ' కుర్రాడిపై దాడి.. అయ్యయ్యో వద్దమ్మా…అంటూ

సోమవారం, 18 అక్టోబరు 2021 (22:57 IST)
sarath
సోషల్‌ మీడియాలో కొన్నిరోజులుగా ‘సుఖీభవ’ అనే వీడియో ఒకటి విపరీతంగా వైరల్‌ అవుతోంది. నల్లగుట్ట శరత్‌.. ఓ టీ పౌడర్‌ యాడ్‌ను రీ-క్రియేట్‌ చేసి తీన్మార్‌ స్టెప్పులేయడం, అది కాస్త మీమ్స్‌ పేజీల ద్వారా ఇంటర్నెట్‌లో వైరల్‌ కావడం తెలిసిందే. ‘అయ్యయ్యో వద్దమ్మా… సుఖీభవ..’ ఈ లైన్స్ వాడి మీమ్స్, ట్రోల్స్.. ఓ రేంజ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం కొన్ని యాడ్స్, సాంగ్స్ ఇలానే ట్రెండ్ అవుతున్నాయి.
 
ఎప్పుడో ఆర్నెళ్ల క్రితం వచ్చిన ఓ టీ పౌడర్ యాడ్ ఇప్పుడు ఫేమస్ అయిపోయింది. హైదరాబాద్‌కు చెందిన శరత్.. ఓ రోజు పెళ్లి డ్యాన్స్‌లో భాగంగా డ్యాన్స్ వేస్తూ సరదాగా.. ‘అయ్యయ్యో వద్దమ్మా.. ఆ పక్కనే టీ కొట్టు ఉంది. అందరికీ ఓ కప్పు టీ ఇద్దామనుకున్నా.. సుఖీభవ.. సుఖీభవ..’ అంటూ పాటపాడి తీన్మార్ స్టెప్పు లేశాడు. అంతే, ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. వైరల్ అవడమే కాదు.. శరత్.. రాత్రికి రాత్రే సెలబ్రిటీ కూడా అయిపోయాడు. ఓవర్ నైట్ లో యూట్యూబ్ స్టార్‌ అయ్యాడు. 
 
అయితే తాజాగా శరత్‌పై దాడి జరిగింది. రక్తం కారేలా తీవ్రంగా కొట్టారు. కొంతమంది అతడిని విచక్షణారహితంగా కొట్టారు. దాడికి కారణాలు తెలియాల్సి ఉంది. అయితే, ఏదో ఈవెంట్ లో గొడవ జరిగి అతడిని కొట్టినట్లు తెలుస్తోంది. శరత్ గాయాలతో ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు