రవితేజ మోస్ట్ వాంటెడ్ పెయింటర్. అతన్ని పట్టుకోవడానికి రా ఏజెన్సీ వెదుకుతుంటుంది. ఇంతలో ఓ వ్యక్తి.. అతను పత్తి పండించే రైతు అని చెబుతాడు. తనకి ఇంకొన్ని అవతారాలు కూడా ఉన్నాయి. చివరగా రవితేజ ఒక సరస్సు దగ్గర నిలబడి పాక్షికంగా తన ముఖాన్ని చూపిస్తారు. ఆ తర్వాత ఈగల్ అనే టైటిల్‌ని రివీల్ చేశారు. టైటిల్ స్ట్రైకింగ్ గావుంది. గ్లింప్స్ కథానాయకుడి ప్రపంచాన్ని ఎస్టాబ్లెస్ చేసింది. ఇందులో అనుపమ పరమేశ్వరన్, నవదీప్ , మధుబాల వంటి ప్రముఖ తారాగణం కూడా కనిపించారు. కావ్యా థాపర్ మరో కథానాయిక. విజువల్స్ అత్యద్భుతంగా ఉన్నాయి. నేపధ్యం సంగీతం కూడా ఎక్స్ టార్డినరిగా వున్నాయి.
కార్తీక్ ఘట్టమనేని రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మణిబాబు కరణంతో పాటు దర్శకుడు స్వయంగా స్క్రీన్ ప్లే రాశారు. టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఈ హైబడ్జెట్ ఎంటర్‌టైనర్ కోసం, టాప్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు. మణిబాబు కరణం డైలాగ్స్ అందించిన ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని ఎడిటర్, సినిమాటోగ్రాఫర్ కూడా. దవ్‌జాంద్ సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీనాగేంద్ర తంగల ప్రొడక్షన్ డిజైనర్.
తారాగణం: రవితేజ, అనుపమ పరమేశ్వరన్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల, కావ్య థాపర్