కొడుకు గురించి తల్లికి బాగా తెలుసు. అతని కదలికలు, మనసులోని భావాలు ఇట్టే పసిగడుతుంది. అందులో స్టార్ హీరో అల్లు అర్జున్ తల్లి నిర్మలగారి గురించి చెప్పనవసరంలేదు. ఆమెకూ కొడుకంటే ఎంతో ప్రేమ. ఇదిలావుండగా, చిరంజీవి కుటుంబంతో అల్లు అర్జున్ కుటుంబానికి తేడాలు వచ్చాయన్నది లోకం ఎరిగిన విషయమే. పవన్ కళ్యాణ్ ఎ.పి ఎన్నికల్లో పాల్గొంటే ప్రత్యర్థి వర్గానికి అల్లు అర్జున్ సపోర్ట్ చేయడంతో లోకమంతా వారి ఇంటి వ్యవహారాలపై ద్రుష్టి పెట్టింది.