సంక్రాంతికి "ఖైదీ నంబర్ 150" విడుదల చేయాల్సిందే : రంగంలోకి దిగిన చిరంజీవి

ఆదివారం, 25 సెప్టెంబరు 2016 (11:34 IST)
తన 150వ చిత్రం ఖైదీ నంబర్ 150ను ముందుగా అనుకున్నట్టుగా సంక్రాంతికి విడుదల చేయాల్సిందేనని మెగాస్టార్ చిరంజీవి గట్టిపట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం ఆయనే ఏకంగా కార్యకథనంలోకి దిగారు. ఇందుకోసం షూటింగ్‌తో పాటు.. అన్ని పనులను ఆయనే దగ్గరుండీ మరీ చూసుకుంటున్నారు. 
 
తమిళ చిత్రం కత్తి‌ను వివివినాయక్ దర్శకత్వంలో చిరంజీవి తన 150వ చిత్రంగా రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చకచకా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టు ముందుగానే చెప్పేశారు. అందువలన ఆ సమయానికి అన్నిపనులు పూర్తయ్యేలా చూసుకోవలసిందే.
 
ఈ కారణంగానే ఈ సినిమాలో ఇంతవరకూ తాను చేసిన సీన్స్‌కి డబ్బింగ్ చెప్పుకోవడానికి చిరంజీవి రంగంలోకి దిగారు. శనివారం నుంచే ఆయన తన పాత్రకి డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కొత్తగా ఉండాలనే ఉద్దేశంతో వెరైటీగా ప్లాన్ చేసే పనిలో చరణ్ వున్నాడు. ఈ సినిమాకి గల ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకుని వినాయక్ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కాజల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాకి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి