మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే సైరా నరసింహా రెడ్డి చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం తర్వాత 152వ చిత్రంగా కొరటాల శివ దర్శకత్వంలో నటించనున్నారు. ప్రస్తుతం ఈయన వయసు ఆరు పదులు. అయినప్పటికీ.. యువ హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా స్టంట్స్, డ్యాన్సులు చేస్తూ ప్రేక్షకులను ఆలరిస్తున్నారు.
అంతేనా ఆరు అరవై యేళ్ళ వయసులోనూ ఎంతో ఉత్సాహం ఉంటూ సినిమాలు చేస్తున్న హీరో. పైగా, ఎందరికో ఆదర్శం. చిరుని చూసి హీరో కావాలని కలలు కన్నవారు ఎందరో ఉన్నారు. దాదాపు ఆరేళ్ళ తర్వాత ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చిన చిరు వరుస సినిమాలు చేస్తున్నారు.
'ఖైదీ నెం 150' చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన చిరుకి ఈ చిత్రం మంచి విజయం అందించింది. రీసెంట్‌గా "సైరా" అనే చారిత్రాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం కూడా మంచి విజయం సాధించింది. ఇక ప్రస్తుతం తన 152వ సినిమాగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు చిరు. దేవాలయాలకి సంబంధించిన నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందట. అయితే ఈ మూవీ కోసం బరువు తగ్గేందుకు చిరు కసరత్తులు చేస్తున్నారు.
ప్రస్తుతం చిరు జిమ్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది పాత ఫోటో అని కొందరు అంటున్నారు. అందుకు కారణం చిరు రీసెంట్‌గా వ్యక్తిగత పనుల మీద అమెరికాకి వెళ్లినట్టు తెలుస్తుంది. అక్కడ నుండి తిరిగి రాగానే డిసెంబర్ మొదటివారం నుంచి ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు. ఈ చిత్రాన్ని రామ్ చరణ్, నిరంజన్ రెడ్డిలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్రిష హీరోయిన్ కాగా, కాజల్ మరో హీరోయిన్‌గా ఎంపిక చేసే అవకాశం ఉంది.