టీఎన్ఆర్ చేసిన ఎన్నో ఇంటర్వ్యూలు తాను చూశానని, తను ఇంటర్వ్యూ చేసే విధానం తనను ఎంతో ఆకట్టుకునేదని గుర్తుచేశారు. జీవితంలో పట్టుదలతో ఎదిగిన టీఎన్ఆర్ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. ఈ కుటుంబానికి ఎలాంటి అవసరమొచ్చినా తాను అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు.
మీరంటే వీరాభిమానం: చిరుతో టీఎన్ఆర్ భార్య
మీరంటే వీరాభిమానం సార్. తన 200వ ఇంటర్వ్యూ మీతోనే చేయాలని అనుకునేవారు. ఇంతవరకు మిమ్మల్ని కలవలేదు. మీరు మాకిలా ఫోన్ చేయడం ఎంతో సంతోషం కలిగించింది ఈ మాటలు మరెవరివో కాదు టీఎన్ఆర్ సతీమణివి. ఆమె భర్త మరణించిన విషయం తెలిసి మెగాస్టార్ చిరంజీవి మంగళవారం ఆమెకు ఫోన్ చేసి పరామర్శించగానే ఆమె అన్న మాటలివి.